Tuesday, March 24, 2026

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ, పోలు వెంకటేశ్వరరావు గారికి

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా పోలీసు విభాగంలో నిరంతరం విధులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందిన కోర్ట్ లైజన్ ఆఫీసర్, ఏఎస్ఐ పోలు వెంకటేశ్వర రావు గారికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు మరియు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు, , శాలువ, పులమాల వేసి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలు వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలంగా పోలీసు శాఖలో అంకితభావంతో విశేష సేవలు అందించారని, క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించడంతో పాటు, ప్రజలకు అహర్నిశలు సేవలు అందించారని, నేటి వరకూ కోర్టు లైజనింగ్ ఆఫీసర్ గా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదైనా, సమాజ రక్షణ కోసం సేవ చేయడం గొప్ప గౌరవంగా అభివర్ణించారు. పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ సుమారు 38 సంవత్సరాలు వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, పోలీసు శాఖకు విశేష సేవలు అందించారని ఎస్పీ కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే, అవసరమైనప్పుడు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భరోసా ఇచ్చారు. తన ఛాంబర్ లోకి ఏఎస్ఐ గారిని పిలిపించుకొని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏఎస్ఐ పోలు వెంకటేశ్వరరావు గారి గురించి రెండు మాటలు. 1987 వ సంవత్సరంలో కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికైన పోలు వెంకటేశ్వరరావు, ఏడాది పాటు విశాఖపట్నంలో విధులు నిర్వహించారు. అనంతరం కన్వర్షన్ లో బాగంగా సివిల్ కానిస్టేబుల్ గా బదిలీ అయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో మన్నూరు పులివెందుల, సింహాద్రిపురం, కడప పోలీస్ కంట్రోల్ రూం స్టేషన్ల లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా నుండి కడప నగరంలో కోర్టు లైజన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ నేడు ఏఎస్ఐ గా పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో ఏఓ. బి.క్రిష్ణుడు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్, యం.తులసీరాం, ఆర్ఐ యం.పెద్దయ్య, ఎస్బి ఇన్స్పెక్టర్ పి. రాజా రమేష్, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి.మధు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News