
నేటి సాక్షి – కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద కొందరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. తమ క్షౌరశాల దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి ‘పానీపూరి’ బండి అడ్డుపెట్టి వ్యాపారం చేస్తున్నాడని దుకాణం యజమాని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య గొడవ పెరిగి కత్తులతో దాడి వరకు వెళ్ళింది. ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అక్కడున్న ప్రజలు పరుగులు తీశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కత్తిపోటుకు గురైన వ్యక్తికి ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో ఒకరు బైక్ ను తగులబెట్టడంతో కోరుట్ల లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.




