నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : లక్కిరెడ్డిపల్లి మండలంలో నలంద విద్యానికేతన్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యయులు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి విజ్ఞానవేత్తలు అని కొనియాడారు. సార్ సి.వి రామన్ తన ప్రతిభతో రామన్ ఎఫెక్టు ని కనుగొని, అత్యంత ప్రతిష్ఠ కరమైన నోబెల్ బహుమతిని పొందారు అని అన్నారు. అలాంటి వారిలో స్వర్గీయ డి ఆర్ .అబ్దుల్ కలాం, గెలీలియో, జగదీష్ చంద్రబోస్,విక్రమ్ సారభాయ్ లాంటి మరెందరో శాస్త్రవేత్తలు నూతన పోకడలు కనుగొన్నారు అని విద్యార్థులకు తెలిపారు. అనంతరం సామాన్య శాస్త్ర ఉపాధ్యాయురాలు దాసరి ప్రమీల మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త సర్ సి వి రామన్ అని ఆయనకి నోబెల్ బహుమతి తో పాటు భారతదేశ అత్ున్నత పురస్కారం అయినా భారత రత్న కూడా పొందారు అనితెలిపారు. విద్యార్థులు కూడా వారి మార్గంలో పయనించి వారి లాగే మరెన్నో పురస్కారాలు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రమణ ఉపాధ్యాయులు జగదీష్, హసీనా, వజిదా, సాయి మల్లికా, రామ కృష్ణా, రామంజుల్ రెడ్డి, ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి,శివారెడ్డి, విజయలక్ష్మి , లక్ష్మికుమారి, సురేఖ, రాధ, రెడ్డమ్మ, షాహిన,చైతన్య మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.




