- ముగిసిన కొత్తపేట జాతర ఉత్సవాలు
నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో శుక్రవారం జాతర ఉత్సవాలు వైభవంగా ముగిసాయి. ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం ఆలయ ఆవరణలో స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఆసీనులు గావించి ఆలయం చుట్టూ ఐదు సార్లు రథాన్ని తిప్పారు. రాయికల్, మల్లాపూర్, మేడిపెల్లి, కొరుట్ల , జగిత్యాల తదితర మండలాల నుండి భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. మహశివరాత్రికి ఇక్కడ గత మూడు రోజులుగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. రథోత్సవంతో ఉత్సవాలు ముగిసాయి. ఈ కార్యక్రమంలో ఇఓవిక్రంగౌడ్, అర్చకులు రాజేశ్వరశర్మ, ఆలయ పాలకవర్గ సభ్యలు, మాజీ ప్రజాస్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




