నేటి సాక్షి వీణవంక : కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, మల్లారెడ్డి పల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం దాతల సహకారంతో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి దేవాలయ కమిటీ వారిచే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. రాయణవేణి కనుకయ్య- రాధ దంపతులు అంజి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మరియు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని ఇక్కడ ఎలాంటి (ప్లాస్టిక్ వ్యర్థాలు)పేపర్ ప్లేట్లు గాని డిస్పోజల్ గ్లాసులు గాని వాడకుండా మోతుకాకులలో భోజనం వడ్డిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు. అనంతరం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గణేష్ కళాబృందం వారిచే భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.




