నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శుక్రవారం సైన్స్ డే ఘనంగ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో డైరెక్టర్ జై తిరుపతి రావు సివి రామన్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు జంగిలి శశికాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాలైన వర్కింగ్ మోడల్స్ సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తయారుచేసిన కొన్ని ప్రాజెక్టులు ప్రస్తుత సమాజానికి ఎంతో ఉపయోగమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, డైరక్టర్ జె తిరుపతి రావు, గ్రామీణ వైద్యుల సంఘ అధ్యక్షులు శేగంటి శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు మరియు పోషకులు పాల్గొన్నారు. రాయికల్ మండలం భూపతిపూర్, మైతాపూర్, ఇటిక్యాల తదితర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.




