Tuesday, March 24, 2026

తెలంగాణ లో రాబోయేది బిఅర్ఎస్ ప్రభుత్వమే

  • జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు

నేటిసాక్షి/మంగపేట : మంగపేట మండలంలో తిమ్మంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నెరవేర్చని హామీలను ఎండగడుతూ ప్రజలకు దగ్గరగా బిఅర్ఎస్ పార్టీ శ్రేణులు ఉండాలని అన్నారు కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. పదేళ్ళ కాలంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు అందాయని అన్నారు, మోసపూరిత 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం దగా చేస్తుందని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు 4 వేల రూపాయిలు, 6వేల రూపాయిలు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డ్స్ ఏటు పోయే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తుంది అని అన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పి బిఅర్అర్ పార్టీ ఆదరించి అధికారంలో తీసుకురావాలని కార్యకర్తలను కోరారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ తోట రమేష్ కాకులమర్రి ప్రదీప్ రావు తాటి కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్ పాక్స్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్ కొమరం ధనలక్ష్మి యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బడిశా నాగారమేష్ చిట్టీమల్ల సమ్మయ్య చిలకమర్రి రాజేందర్ కోరం సంతోష్ చల్లగురుగుల తిరుపతి మల్లికంటి శంకర్ చిలకమర్రి లక్ష్మయ్య గాదె శ్రీనివాస చారి అయూబ్ బుట్టో దంతానపెల్లి నరేందర్ నాగేష్ పండా శ్రీను ఎగ్గడి అర్జున్ సోషల్ మీడియా వారియర్స్, పూజారి సతీష్, గుడివాడ శ్రీహరి  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News