- పార్టీ పేరు తన పేరు తో వసూళ్ళ పర్వం
- వసూళ్ల పర్వం పై సూర్య ఆరా

నేటిసాక్షి/మంగపేట : గ్రామాల అభివృద్ధికి దోహదపడే ఇసుక క్వారీల నుండి లబ్ధి పొందాలని కొంత మంది స్థానిక నేతలు స్వార్థ పూరితంగా చేస్తున్న వసూళ్ల పర్వంపై మంత్రి సీతక్క తనయుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ దనసరి సూర్య ఆరా తీసి ఆ నాయకులను తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. కొంతమంది చోటా మోటా నాయకులు కాంగ్రెస్ పార్టీ పేరు తన పేరు చెప్పి జిల్లా లోని పలు మండలాల్లో ఉన్న ఇసుక ర్యాంప్ లలో డబ్బులు వసూలు చేస్తున్నారని పార్టీ కార్యకర్తల నుండి అందిన సమాచారం మేరకు సూర్య ఇసుక క్వారీలు ఉన్న గ్రామాల ప్రజలను కలుసుకోని వసూళ్లకు పాల్పడుతున్న వారిని గుర్తించే పనిలో పడ్డట్లు సమాచారం. అందులో భాగంగానే పలు గ్రామాల ప్రజల నుండి అందిన పిలుపు మేరకు ప్రజలతో సమావేశమైన పలు అంశాలపై చర్చించినట్లు స్థానిక ప్రజలు కొంత మంది కాంగ్రెస్ నాయకులు చర్చించుకోవడం గమనార్హం. ప్రజలతో మమేకమై వారి అభిప్రాయా సేకరణ చేసినట్లు తెలుస్తుంది స్థానిక ప్రజలు చెప్పిన విషయాలను బట్టి ఇసుక ర్యాంప్ లల్లో జరిగే అవకతవకల గురించి తెలుసుకుని అట్టి అంశాలను అదిష్టానానికి మంత్రి సీతక్కకు తెలియజేసినట్లు వినికిడి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇసుక క్వారీల కి సంబంధించి అంతిమంగా గ్రామినాభివృద్ది జరిగేలా చూడడమే తన బాధ్యత అని ఆయా గ్రామాల ప్రజలకు మాటిచ్చినట్లు తెలుస్తుంది. ఇసుక క్వారీలు ఉన్న గ్రామాల ప్రజలంతా ఒక్కటిగా మెలగాలని ఒకే నెంబర్ క్వారిపై ఇద్దరు ముగ్గురు గ్రూపులుగా ఏర్పడి పోటీతత్వం పోకూడదని పార్టిలకు అతీతంగ అందరు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎకాభిప్రాయం పైన ఉండి ప్రజలు ఆర్థికంగా ఎదుగుతూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఇసుక క్వారీల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారికి స్థానికంగా ఉన్న కొంత మంది అధికారులు మీడియా వాళ్ళు కూడా సహాకరిస్తున్నట్లు తెలిసిందని సూర్య అన్నట్లుగా మండలంలో జోరుగా ప్రచారం జరుగుతుంది పార్టీ పేరు తన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని సూర్య హెచ్చరించినట్లు తెలిసింది. ఆఖరికి తాను తప్పు చేసినట్లు నిరూపించిన ప్రజా వేదికగా శిక్ష అనుభవిస్తా అని సూర్య అన్నట్లుగా స్థానికంగా ఆ పార్టీ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తుంది. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడమే గాక పార్టీని జిల్లా నాయకత్వాన్ని అప్రతిష్ట పాలు చేసిన ఆ నేతలు ఎవరని వారిపై చర్యలు ఉంటాయా వుండవా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.




