Tuesday, March 24, 2026

బాగా చదవాలి.. ఉన్నతంగా ఎదగాలి..

  • పరీక్షా సామాగ్రి పంపిణీ చేసిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
  • చిన్నగొట్టిగల్లు, భాకరాపేట పాఠశాలల్లో విద్యార్థులకు అందజేత

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పదవ తరగతి పునాది లాంటిదన్నారు. శుక్రవారం చిన్నగొట్టిగల్లు, భాకరాపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవతరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతుండటంతో చిన్నగొట్టిగల్లు మండలం విద్యార్థి విభాగం అధ్యక్షులు హరినాథ్ ఆధ్వర్యంలో పరీక్షా సామాగ్రిని శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయొద్దని, పరీక్షలంటే భయపడాల్సిన పనికూడా లేదని, ఒక ప్రణాళికతో చదవితే మంచి మార్కులు సాధింవచ్చన్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నతంగా ఎదగాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఒక ప్రణాళికతో సమయం, సబ్జెక్టులవారీగా ఎలా చదవాలన్నది ఎవ్వరికి వారు వ్యక్తిగతంగా ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. పట్టుదలతో చదివి అనుకున్నది సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నేతలు ఓబుల్ రెడ్డి, చెంగల్ రెడ్డి మోహన్, భూపాల్, రవికుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, షాభాద్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News