Tuesday, March 24, 2026

రేయింబవళ్ళు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

  • నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లలో తరలింపు
  • సరిహద్దులు దాటిస్తున్న ఇసుకాసురులు

నేటి సాక్షి వీణవంక: మండల కేంద్రంలోని వీణవంక మండలాలతో పాటు పలు గ్రామాలకు పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. సంబంధిత అధికారులు నిఘా పెట్టకపోవడంతో ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టరాజ్యంగా ఇసుక తరలిపోతుందని సర్వత్ర విమర్శలు వెలుబడుతున్నాయి. వాహనాలకు ఎలాంటి నెంబర్ ప్లేట్లు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా వీణవంక సరిహద్దులు దాటుకొని పలు గ్రామాలకు ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. నెంబర్ ప్లేట్ లేని ఇసుక ట్రాక్టర్లు ఎక్కువగా మైనర్లు నడపడం విశేషం. వీరు అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఇతర వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫోన్ మాట్లాడుకుంటూ ఓవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేస్తూ వచ్చే ఇసుక ట్రాక్టర్లను చూసి బెంబేలెత్తిపోతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News