- నివాళుల కార్యక్రమంను విజయవంతం చేద్దాం
- ఎమ్మార్పీఎస్ కే టి దొడ్డి మండల ఇంచార్జి గువ్వలదిన్నె జంబయ్య మాదిగ
నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : శనివారం కే టి దొడ్డి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం,ఎస్సీ రిజర్వేషన్ల కోసం ఏబిసిడి వర్గీకరణ సాధించుటకై, వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసినటువంటి మాదిగ అమరుల త్యాగాలను స్మరిస్తూ,వారికి నివాళులు అర్పించే కార్యక్రమం కే టి దొడ్డి మండల కేంద్రంలో ఉదయం 09:00 గంటలకు ఉంటుంది. కాబట్టి ఎమ్మార్పీఎస్ నాయకులు,మండల నాయకులు, ఆయా గ్రామాల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొని మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పించుటకై ప్రతి ఒక్కరూ రావాలని కే టి దొడ్డి ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గువ్వలదిన్నెజంబయ్య మాదిగ తెలిపారు.




