

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : భవిష్యత్తు అంతా సైన్స్ దే అని ఆ దిశగా విద్యార్థులు పఠానాశక్తిని పెంపొందించుకోవాలని ప్రిన్సిపాల్ బూర సైదయ్య సూచించారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ రంగంలో విశేష సేవలు అందించిన మహా నీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ. సి వి రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టిన రోజును నేషనల్ సైన్స్ డే గా సేకరించడంతో ఫిబ్రవరి 28న భారత జాతీయ సైన్స్ దినోత్సవం ఏర్పడిందని అలాగే నిత్య జీవితంలో ప్రతి పని వెనకాల సైన్స్ దాగి ఉంటుందని దానిని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, ఫీజు పోటీలతొ పాటు సైన్స్ సెమినార్ కూడా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ నమూనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




