Wednesday, March 25, 2026

జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అధికంగా జరిగేలా చూడాలి

  • గ్రామ స్థాయి, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి రైతులకు ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై (ఎ పి సి ఎన్ ఎఫ్ ) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి అవగాహన కల్పించాలి
  • జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి కలెక్టరేట్ స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫిరేన్స్ హాలు నందు జరిగిన గ్రామ స్థాయి, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి రైతులకు ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై (ఎపిసిఎన్ఎఫ్ ) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబందిత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ మాట్లడుతూ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై చిన్న సన్నకారు రైతులకు అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలని తెలిపారు కాషాయం ద్వార పంటలు పండించే పద్దతిని రైతులకు తెలపాలన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు, ఆకూ కూరలు పండించడం ద్వారా పెట్టుబడులు తగ్గుతుందని, రైతులు పండించే పంటలు అదిక దిగుబడి వస్తుందని దినవలన చిన్న సన్న రైతులు లభపడుతారని తెలిపారు. రైతు సాధికార సంస్థ “ఆర్గానిక్ కార్యక్రమం ద్వారా, ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా విస్తరించే లక్ష్యంతో అన్ని గ్రామాలు మరియు రైతులతో వ్యవసాయాన్ని లాభదాయకంగా, స్థిరంగా మరియు వాతావరణ అనుకూలంగా మార్చేందుకు కృషి చేయాలని ఇది అందరికీ సురక్షితమైన ఆహారాన్ని అందించడమే కాకుండా, మట్టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు రాబోయే తరాల కోసం నీటిని సంరక్షించడంలో తోడ్పడుతుందని తెలిపారు. చిన్న గొట్టిగల్లు మండలం నుండి సరస్వతి అనే మహిళా రైతు ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అందులో బీజామృతంతో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం కషాయం వాడకం ప్రకృతి వ్యవసాయ సూత్రాల ప్రకారం చేయాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో పెరటి తోటల పెంపకం ఆకుకూరలు, కూరగాయలు, దుంప రకాలు, తీగజాతి, ఉల్లి,వెల్లుల్లి, క్యాబేజీ, కాలీఫ్లవర్, పూల మొక్కలు, కరివేపాకు మునగ బొప్పాయి జామ అరటి ఇలా అన్ని రకాల ప్రకృతి వ్యవసాయ క్రింద చేసుకోడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సంధర్భంగా సత్యనారాయణ అనే రైతు తన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను, పండించే పంటలు మరియు పొందుతున్న ఫలితాలను వివరించారు. “ప్రకృతి వ్యవసాయం మరియు రసాయన వాడకం ద్వారా వ్యవసాయం మధ్య గల వ్యత్యాసాలు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయని, ప్రకృతి వ్యవసాయ విధానాల వలన అధిక ప్రయోజనాలు స్పష్టంగా కనపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమములో వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు, డి పి ఏం షణ్ముగం, డ్వామా పిడి శ్రీనివాస్ ప్రసాద్, ఉద్యానఅధికారి, ఎ పి ఎమ్ ఐ పి అధికారి మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News