నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో (రాధారపు నర్సయ్య) : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్లేట్ హైస్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో చదువుతున్న వివిధ తరగతుల విద్యార్థినీ విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రాజెక్ట్ వర్క్స్, నమూనాలను ఉపాధ్యాయ బృందంను, పలువురు విద్యార్థులను,పిల్లల తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షించాయి. సైన్స్ డే లో భాగంగా వివిధ తరగతుల విద్యార్థిని విద్యార్థులు తయారు చేసినటువంటి సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ లలో రెస్పిరేటరీ సిస్టం వాటర్ ప్యూరిఫై సిస్టం, సౌండ్ ఫంక్షన్స్, అదేవిధంగా వాటర్ సైకిల్ ,చేపల ఎక్వేరియం తదితర ప్రాజెక్టు వర్క్సులను చూసిన కరస్పాండెంట్, డైరెక్టర్లు, పాఠశాల ప్రిన్సిపల్ పాధ్యాయులు విద్యార్థులు పిల్లల ప్రతిభ పాటవాలను చూసి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని విద్యార్థుల ప్రతిభ పాట వాలకు ప్రోత్సాహక బహుమతులను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్ రెడ్డి పాఠశాల డైరెక్టర్ తిరుపతిరెడ్డి, రాజ్యలక్ష్మి, ప్రిన్సిపల్ స్వప్న, ఇంచార్జ్ మల్లికార్జున్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




