
నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): టైలర్స్ డే దినోత్సవాన్ని శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అలయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్, మేర సంఘం ఆద్యక్షులు తాళ్లపల్లి సుందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేర సంఘం టైలర్ వృత్తిదారులను సన్మానించి, స్థానిక సతీష్ టైలర్ షాప్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం మామిడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమెరికా దేశంలో 1819లో జన్మించిన విలియమ్స్ హో అతి చిన్న వయసులో 1845లో కుట్టు మిషన్ ను రూపొందించి ఫిబ్రవరి 28న ప్రపంచానికి అంకితం ఇచ్చిన రోజునే “ప్రపంచ దర్జీ కళా దినోత్సవం (టైలర్స్ డే)” జరుపుకుంటారన్నారు. శ్రీ శ్రీ జటగిరి శంకర దాసమయ్య దివ్య ఆశీస్సులతో టైలర్ వృత్తి మీద ఆధారపడి ఎంతో మంది వివిధ కులాలకు చెందిన వారు జీవిస్తున్నారని, ముఖ్యంగా మేర కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుల వృత్తిదారులను ఆదుకోవాలన్నారు. ఈ వృత్తి మీద ఆధారపడుతున్న పేద బలహీన వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా కులాలకు మాదిరిగానే సంక్షేమ పథకాలు మేర కులానికి కూడా వర్తింప చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని, దర్జీ అంటే ఒకప్పుడు దర్జాగా బతికేవాడు కానీ ఇప్పుడు రెడీమేడ్ రావడం వల్ల ఆ పరిస్థితి లేదు కాబట్టి బీసీ-డీ నుండి బీసీ-ఏ కు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా 258 జోన్ చైర్మన్ ఎలగందుల అశోక్, సంఘం, ప్రధాన కార్యదర్శి ఎలిగేటి మహేందర్, కోశాధికారి తోడేటి మురళి గౌడ్, ఉపాధ్యక్షులు బైరి చంద్రమౌళి, బొల్లం మల్లేశం, వేముండ్ల సుభాష్, పిఆర్ఓ, సంఘం కోశాధికారి కందుల సతీష్, క్లబ్ గౌరవ సభ్యులు గుర్రం సత్యనారాయణ, సంఘం ప్రధాన కార్యదర్శి ఓదెల నరేష్, ఉపాధ్యక్షులు మామిడి శెట్టి చిన్న కొండయ్య, మామిడి శెట్టి తిరుపతి, మామిడి శెట్టి పెద్ద కొండయ్య, కందుల మల్లేష్, కొత్తకొండ నగేష్, కొత్తకొండ కిష్టయ్య, రాపర్తి గంగాధర్, ఓదెల శ్రీనివాస్, ఓదెల రమేష్, ఓదెల సంతోష్, కొట్టూరి శ్రీనివాస్, కొట్టూరి వెంకటేశం, గట్ల మధుకర్, గట్ల అంజి బాబు, తదితరులు పాల్గొన్నారు.




