Wednesday, March 25, 2026

సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ జిల్లా సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించగా, ఈ సమావేశంలో పలు తీర్మానాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగిందని సంఘం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి ఎండి హబీబ్ హుస్సేన్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అధ్యక్షత వహించగా, ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి ఎండి హబీబ్ హుస్సేన్ లు పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా, సొసైటీ సభ్యులు ఆమోదంతో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఫేస్ 1,2 లో గల అంతర్గత సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని, అవసరమైనచోట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఫేస్ 2 లో ఉన్న 11 కెవి విద్యుత్ టవర్ తీగలను తొలగించుట, ఫేస్ 3 గల టవర్ ను తొలగించి వేరేచోట ఏర్పాటు చేయుట గురించి తీర్మానాలు చేశామని తెలిపారు. సొసైటీలో ఇంకా అర్హులైన వారికి ప్లాట్లు ఇచ్చి, పొజిషన్ రాని వారికి ఫేస్ 3లో కోర్టు కేసులు క్లియర్ కాగానే ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఎస్ మొండయ్య, సంయుక్త కార్యదర్శి భూముల రామ్మోహన్, కోశాధికారి డి రాజమౌళి, కార్యవర్గ సభ్యులు నాగుల గోపాల్, బి కళావతి, ఏవిఆర్డి ప్రసాదరావు, సయ్యద్ ఇంతియాజ్ అహ్మద్, న్యాయ సలహాదారులు పుప్పాల హనుమంతరావు, సభ్యులు సంగర్శ్ సంతోష్, ఎస్ రమేష్, పి తిరుపతి రెడ్డి, శ్రీపతి బాపురావు, పొన్న మల్లయ్య, ఎల్ గోవింద్ రెడ్డి, బి లలిత, ఏ సునీత, సిహెచ్ మధుసూదన్ రెడ్డి లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News