Wednesday, March 25, 2026

విశ్వకర్మ కార్పెంటర్స్ అషోసియన్ నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : శనివారం 01-03-2025, పాలిటెక్నిక్ కళాశాల మైదానం లో విశ్వకర్మ కార్పెంటర్స్ అషోసియన్,వనపర్తి ఆద్వర్యం లో జరిగిన ముఖ్య సభలో వనపర్తి పట్టణ కార్పెంటర్లు అందరు హాజరు అయ్యారు,ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్రంగి వృత్తి పై తీవ్ర పక్షపాతం చూపిస్తుందని వారు అన్నారు, అంతేకాకుండా కార్పెంటర్ దుఖాణ సముదాయాలకు గృహ జ్యోతి పథకం లో భాగంగా ‘0’ కరెంటు బిల్లు అమలు చెయ్యాలని మరియు ప్రతి కార్పెంటర్ దుకాణానికి ప్రభుత్వం లైసెన్సు ఇచ్చి ఆ లైసెన్సులపై బ్యాంకులో 50% సబ్సిడీ రుణాలను కార్పెంటర్లకు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.అంతే కాకుండా అర్హులైన ప్రతి కార్పెంటర్ కు సబ్సిడీ లో పని ముట్లను అందజేసి వృత్తి నీ ప్రోత్సహించాలన్నారు.లేనియెడల రాష్ట్రం మొత్తం కార్పెంటర్లు భవిష్యత్ కార్యాచరణ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం విశ్వకర్మ కార్పెంటర్స్ అసోషియన్ వనపర్తి,నూతన కమిటీని ఎన్నుకున్నారు సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా ఎం .తిరుపతయ్య చారి,కె , భరత్ కుమార్ చారి ని ఎన్నుకున్నారు.కోశాధికారి గా కె . బాబు చారి, సురేష్ చారి ని మరియు ఉపాధ్యక్షులు గా కె . బ్రహ్మం చారి, యాదయ్య చారి. శేఖర్ చారి. దుర్గాప్రసాద్ చారి, మరియు సలహాదారులుగా మనయ్య చారి, శేఖర్ చారి, కృష్ణమాచారి, రఘునాథ చారి నీ సభ్యులు ఎన్నుకున్నారు,మరియు పట్టణ కార్పెంటర్లు కె . భాస్కర్ చారి,సుదర్శన్ చారి,శివ చారి,పవన్ చారి,బాలకృష్ణ,వి . నవీన్ చారి, పానుగల్ శేఖర్ చారి,సయ్యద్ భాష,జనార్ధన్ చారి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News