Wednesday, March 25, 2026

పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన పూర్వ విద్యార్థులు

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను పూర్వ విద్యార్థుల బృందం శనివారం సందర్శించి తమ పూర్వ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. నాడు, నేడూ పాఠశాలలోని వసతులు, తమకు ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని విద్యార్థులకు వివరించారు.పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు పటిష్ఠంగా సిద్ధమై మంచి ఫలితాలను సాధించాలని కోరారు. గత విద్య సంవత్సరంలో పదవ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థి ఓ.జేమ్స్ కు పది వెల నగదును బహుకరించారు.అలాగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ,ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానంలో ఉన్నారని, వారు పాఠశాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకరాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధనాచార్యుల్ శ్రీమతి. మాధవి లత,పూర్వ విద్యార్థులు జి.వి. రమణ, పర్శా రాములు, సిరిపురం శ్రీనివాస్, అల్లూరి మహేందర్ రెడ్డి, డా.రవికాంత్, రఘోత్తంరెడ్డి, ఉపేందర్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News