Wednesday, March 25, 2026

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు

  • జోగులాంబ జోన్-7 డిఐజి ఎల్ ఎస్, చౌహన్ ఐపిఎస్
  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం రోజు జోగులాంబ జూన్-7 డిఐజి ఎల్ ఎస్, చౌహన్ ఐపిఎస్, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ తో కలిసి ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు . వనపర్తి జిల్లాలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాల హెలిప్యాడ్ నుండి జెడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల వరకు వరకు రూట్ బందోబస్తుని పరిశీలించారు. విఐపి కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ ఓపెనింగ్ పార్టీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. (బహిరంగ సభకు) పబ్లిక్ మీటింగ్ కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ మీటింగ్ వచ్చే వారికీ వనపర్తి ఆర్టిసి బస్ డిపోలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని పబ్లిక్ మీటింగ్కు వచ్చే వారు తమకు కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేయాలని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే డయల్100 కి ఫోన్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ, కృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News