Wednesday, March 25, 2026

మానవత్వం చాటిన బండి సదానందం యాదవ్

నేటి సాక్షి, మందమర్రి:- తన వద్ద పనిచేస్తున్న కుకట్ల పోశం, మల్లేశ్వరి ల కుమార్తె అంజలీ వివాహానికి ఆర్థిక సహాయం అందించి, అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం యాదవ్ మానవత్వాన్ని చాటారు. శనివారం బండి సదానందం యాదవ్, లక్ష్మీ దంపతులు వారి నివాసంలో కుకట్ల పోశం, మల్లేశ్వరి, వారి కుమార్తె అంజలీ లకు 50 వేల రూపాయల నగదు, పెండ్లి బట్టలను అందజేశారు. ఈ సందర్భంగా సదానందం యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలోని కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన కుకట్ల పోశం, మల్లీశ్వరి దంపతులు గత కొన్ని సంవత్సరాల క్రితం బ్రతుకుతెరువు కోసం పట్టణానికి విచ్చేసి, పట్టణంలోని తన ఇందూ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పనిచేస్తున్నారని తెలిపారు. వారి కుమార్తె అంజలి వివాహం మార్చి 9న వారి స్వగ్రామైన కోటపల్లి మండలం జనగామలో నిర్వహిస్తుండగా, పెళ్లి ఖర్చుల నిమిత్తం మానవత్వ దృక్పథంతో సహాయం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News