Wednesday, March 25, 2026

మాదిగ అమరవీరుల త్యాగం మరువలేము

  • ఏంఅర్పిఎస్ నాయకులు గుగ్గిళ్ల సురేష్

నేటిసాక్షి /మంగపేట : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుగ్గిళ్ల సురేష్ మాదిగ ఆధ్వర్యంలో మార్చి 1న మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలు సందర్బంగా మాదిగ రిజర్వేషన్ ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన అమరులు అయిన వారి చిత్ర పటలకు పూల మాలలు తో స్మరించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ మాదిగ అమర వీరులారా జాతి త్యాగ ధనులారా మీ త్యాగాలను జాతి ఎన్నటికీ మరువదు. మీ పోరాట స్ఫూర్తిని ఎన్నటికీ విడువదు మీరు చిందించిన నెత్తుటి చుక్కల సాక్షిగా ఎస్సి వర్గీకరణను సాధించాం అది సంపూర్ణంగా ఉండేలా జాతి కోసం సమాజ హితం కోసం మందకృష్ణ మాదిగ సారధ్యంలో మీ యాదిలో ఆశయాల దారిలో శ్రమిస్తాం భవిష్యత్తు తరాలకు మీ త్యాగాలను చరిత్రగా అందిస్తాం వీరుల త్యాగాలను మరువలేము అని మాదిగ అమర వీరులను కొనియాడారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు వెంపెల్లి సమ్మయ్య మాదిగ పరికి శ్రీను మాదిగ వెంపెల్లి వీరాస్వామి మాదిగ లంజపెల్లి రవి మాదిగ నైనారపు కేశవులు మాదిగ గాజర్ల రాజు మాదిగ పాలొగొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News