

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లాలో నుండి మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ల నియోజకవర్గం పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలి వెళ్లడం జరిగింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని శంషాబాద్ రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సబితా ఇంద్రా రెడ్డి తనయుడు, యువ నాయకుడు, జాతీయ స్పోక్స్ పర్సన్, టిఆర్ఎస్ పార్టీ రాజేందర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కార్తీక్ రెడ్డి జన్మదిన సందర్భంగాతల సేమియా బాధితులకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, రాజేంద్రనగర్ నియోజకవర్గం, చేవెళ్ల నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ….నా పైన ఉన్న నమ్మకం దృష్టిలో ఉంచుకొని నలుమూలల నుంచి తరలివచ్చి నన్ను ఆశీర్వదించి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.




