Wednesday, March 25, 2026

ఈ-పంట సూపర్ చెక్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్

ప్రతి ఒక్క రైతు తాము సాగు చేస్తున్న పంటలను వ్యవసాయ అధికారుల సహకారంతో పంట నమోదు ఈ- క్రాప్ చేయించుకోవాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
రేణిగుంట మండలం, గాజులమండ్యం గ్రామ పొలాల్లో ఈ క్రాప్ లో గ్రామ వ్యవసాయ సహాయకులు నమోదు చేసిన పంటలను సూపర్ చెక్ తనిఖీ చేసి రైతులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు తాము సాగు చేస్తున్న పంటలను వ్యవసాయ అధికారుల సహకారంతో పంట నమోదు (ఈ క్రాప్) చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రేణిగుంట మండలం, గాజులమండ్యం గ్రామ పొలాల్లో ఈ- క్రాప్ లో గ్రామ వ్యవసాయ సహాయకులు నమోదు చేసిన పంటలను సూపర్ చెక్ తనిఖీ చేసారు. ప్రతి ఒక్క రైతు తాము సాగు చేస్తున్న పంటలను వ్యవసాయ అధికారుల సహకారంతో పంట నమోదు (ఈ క్రాప్) చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతుకు పరిహారం అందించేందుకు తప్పనిసరిగా ఈక్రాప్ నమోదులో రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ రైతులకు అవగాహన కలిగించారు. తమకు ఆర్.యస్.కె అధికారులు ఎప్పటికప్పుడు కలిసి సాగులో సూచనలు అందిస్తున్నారని రైతులు కలెక్టర్ కు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి పండించిన రైతు ధనంజయ రెడ్డి పొలాన్ని సందర్శించి, ఇదే విధంగా గ్రామం లోని మిగిలిన రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించి వినియోగించడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని సూచించారు. వరి పంటకు తగిన మద్దతు ధర అమలు అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు , మండల వ్యవసాయ అధికారి సునీల్ కుమర్ రెడ్డి, గ్రామ రెవెన్యూ అధికారి ,గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News