Wednesday, March 25, 2026

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు

బందోబస్తు విధుల్లో 1000 మంది పోలీసు సిబ్బంది
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి బందోబస్తుకు వచ్చిన అధికారులకు, సిబ్బందికి జిల్లా కేంద్రంలోని నాగవరం ఇందూ గార్డెన్ పంక్షన్ హాలులో వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తు గురించి దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం వెంకటేశ్వర స్వామి దేవాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల , ప్రభుత్వ హాస్పిటల్, కోర్టు కాంప్లెక్స్, ఐటి టవర్స్, జడ్పీహెచ్ఎస్ పాఠశాల మరియు కళాశాల,పెద్దమందడి రోడ్డు వివిధ శంకుస్థాపనలు, మరియు బహిరంగసభ సందర్భంగా ఎక్కడ ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగిన, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని ఆయన పోలీసు అధికారులను హెచ్చరించారు.మొత్తం బందోబస్తును 07 సెక్టార్లుగా విభజించడం జరిగిందని వివరించారు.ఎస్పీలు -04, అడిషనల్ ఎస్పీలు-04, డిఎస్పీలు-08,సిఐలు – 21,ఎస్సైలు – 68, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్ – 140 కానిస్టేబుళ్లు -420, మహిళ కానిస్టేబుల్స్/ మహిళ హోంగార్డు- 250 స్పెషల్ పార్టీస్/రోప్ పార్టీస్/బీడీ టీమ్స్/డాగ్ స్క్వాడ్/ సెక్యూరిటీ వింగ్, మఫ్టీ పార్టీలు పోలీసు సిబ్బంది మొత్తం 1000 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ గారు తెలిపారు. రేపు ఉదయం 8:00 గంటలకు పోలీసుఅధికారులు, సిబ్బంది నీట్ యూనిఫామ్ లో కేటాయించబడిన డ్యూటీలో హాజరుగా ఉండాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న నందున అందరితో మర్యాదపూర్వకంగా వ్యవ హరించాలని సిబ్బందికి, అధికారులకు సూచించారు.అధికారు లందరికీ కమ్యూనికేషన్ సెట్లు ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విధులు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు.డ్యూటీలో ఉన్న అధికారులు సిబ్బంది ఎంతో క్రమశిక్షణతో డ్యూటీ చెయ్యాలని వారి డ్యూటీ ఉన్న ప్రదేశం చుట్టుపక్కల గమనిస్తూ అలర్ట్ గా ఉండాలని తెలిపినారు.ట్రాఫిక్ అండ్ పార్కింగ్ డ్యూటీలో ఉన్న అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి డ్యూటీలు చేయాలని ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే వాహనాలను ఒక క్రమపద్ధతిలో పెట్టించాలని రోడ్ పైన వాహనాలు నిలపకుండా చూడాలని సూచించారు.సీఎం వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు నిలుప కుండా డ్యూటీలో ఉన్న అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి చూసుకోవాలి.వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయంతో కలిసి విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.విఐపీలు ప్రజాప్రతినిధులు, కార్యకర్తల పార్కింగ్ ప్రదేశాలు.పార్కింగ్ -బహిరంగ సభకు వచ్చే విఐపిలకు ప్రజా ప్రతినిధులకు పబ్లిక్ పబ్లిక్ ఆర్టీసీ బస్సు డిపో మరియు ఓల్డ్ మార్కెట్ యార్డ్ లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశంలో వనపర్తి డిసిఆర్బి డిఎస్పీ , ఉమామహేశ్వరరావు వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, వనపర్తి సిఐ, కృష్ణ,కొత్తకోట సిఐ, రాంబాబు, ఆత్మకూరు సిఐ, శివకుమార్ వివిధ జిల్లాల డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News