కామ్రేడ్ ఏం కృష్ణన్ 4వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళి
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మాజీ ఉపాధ్యక్షులు, జాతీయ తపాలా ఉద్యోగుల సమాఖ్య మాజీ ఉన్నత కార్యదర్శి (ఎన్ ఎఫ్ పి ఈ) కామ్రేడ్ ఏం కృష్ణన్ వర్ధంతి నాల్గవ వర్ధంతి కార్యక్రమాన్ని అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పోస్టుమాస్టర్ పి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోస్టల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ యు మహేందర్ మాట్లాడుతూ కామ్రేడ్ కృష్ణన్ 2021 మార్చి 1 న కోవిడ్ తో మరణించడం వల్ల కేంద్ర ఉద్యోగ వర్గం, ముఖ్యంగా తపాలా ఉద్యోగులు ఒక గొప్ప నాయకున్ని కోల్పోయిందని, వారు నిరంతరం ఉద్యోగ సమస్యలపైన, ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపైన అలుపెరగని పోరాటం చేసే వారని, కేంద్ర ఉద్యోగుల క్యాడర్ రిస్ట్రక్చర్ ఆశం పైన పోరాటం చేసి విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడని, తన వ్యక్తిగత జీవితానికంటే సంఘ జీవితానికే అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే వారని, వారితో కలసి పనిచేయడం ఎంతో అదృష్టమని,నేడు కేంద్ర ఉద్యోగులు ఎదురుకుంటున్న క్లిష్ట పరిస్థితులల్లో ఇలాంటి నాయకుడు లేకపోవడం ఉద్యోగ వర్గానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ గ్రూప్ సి బ్రాంచ్ కార్యదర్శి జక్కు రజినీకాంత్, గ్రూప్ డి రాష్ట్ర ఆర్గనైసింగ్ కార్యదర్శి బి తిరుపతినాయక్, నాయకులు సిహెచ్ ప్రవీణ్, సమ్ము రాజు, మీస తిరుమలేష్, మోలుగురి శ్రీనివాస్, శివమ్, అనిల్, గౌరవ్, సంకటి హరీష్, సతీష్, స్వామి, రాజేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.




