- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు నైపుణ్యతపై శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం క్రింద 18 రకాల ట్రేడ్లలో (మేషన్, టైలరింగ్, కార్పెంటర్ రంగాలను మినహా) శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం క్రింద అందిన దరఖాస్తులలో ఎల్-1 స్థాయిలో మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న వాటిని నిబంధనల మేరకు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని తెలిపారు. యువతకు భవన నిర్మాణ రంగం, పెయింటింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, ప్లంబింగ్, మోటార్ సైకిల్ మరమ్మత్తు వంటి వాటిపై శిక్షణ అందించాలని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించి సేంద్రియ ఎరువుల తయారీ, ఉద్యానవన పంటలు ఇతర అంశాలపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. యువత ప్రస్తుత సమాజంలో డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకొని శిక్షణ పొంది జీవితంలో స్థిరపడే అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. జిల్లాలో మరిన్ని జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ పురుషోత్తం నాయక్, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ వై రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




