నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరులో అమరులైన మాదిగ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఈర రమేష్ మాదిగ, మండల కార్యదర్శి ఎల్తూరి సురేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మేకల రవి మాదిగ, అంబాల సంపత్ మాదిగ, దాట్ల రవీందర్ మాదిగ, మండల యూత్ నాయకులు మంతుర్తి శ్రీకాంత్, ఎర్రగొల్ల రాజు, తదితరులు పాల్గొనడం జరిగింది.




