- సమస్యల పరిష్కారం కోసం ఐక్యతగా ఉందాం
- కారోబార్ల నూతన కార్యవర్గం ఎన్నిక
- జిల్లా అధ్యక్షులు కాడేమోని జంగయ్య పిలుపు
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : ఐక్యతగా ఉందాం. మన సమస్యల పరిష్కారం కోసం పోరాడుదాం అంటున్నారు. గ్రామ పంచాయతీ కారోబార్లు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కారోబార్లు(బిల్ కలెక్టర్లు) శనివారం అందరూ కలసి మండల కేంద్రంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షులు కాడేమోని జంగయ్య మీడియాకు తెలిపారు.ఇందులో భాగంగా అధ్యక్షులుగా వెంకటాపురం రవి, ఉపాధ్యక్షునిగా కుమ్మరి పాండు, కార్యదర్శిగా బొల్గం ఉపేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఆవంచ బాలరాజు ముదిరాజ్, కోశాధికారిగా చేగురు కృష్ణ, అధికార ప్రతినిధి పెబ్బే రాజేశ్వర్ (రాజు), సలహాదారులు- బైండ్ల యాదయ్య, సురేమోనీ శివ, బేరి రమేష్, మురళి, ఆంజనేయులు శ్రావణ్, శ్రీనులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు, నూతనంగా ఎన్నికైన కార్యవర్గం మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలలో ఎన్నో ఏండ్ల నుండి పనులను చేస్తున్నా గుర్తింపే దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన సమస్యల పరిష్కారం కోసం ఐక్యతగా ఉందాం. పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు.




