Wednesday, March 25, 2026

ఘనంగా మాదిగ అమర వీరుల దినోత్సవం

నేటి సాక్షి, మునగాల : మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటరు లో శనివారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య‌‌ మాదిగ ఆధ్వర్యంలో అమర వీరుల‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి. జిల్లా నాయకులు కొత్తపల్లి అంజయ్య మాదిగ,పాతకోట్ల నాగరాజు మాదిగ,అమర వీరుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు,‌ అనంతరం శ్రద్ధాంజలి పాటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాల కాలం నుండి మాదిగ దండోరా ఉద్యమం ద్వారా ఎస్సీ వర్గీకరణ కోసం‌ పోరాటాలు చేసి ప్రభుత్వాలను ముచ్చెమటలు పట్టించారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ సోదరులు ‌అనేక మంది ప్రాణ త్యాగం చేశారు, వారి త్యాగాల ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం రాబోతుందని తెలిపారు. మాదిగ అమర వీరుల త్యాగా‌ల‌ను‌ స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్. పి. మునగాల మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ, లంజ పల్లి శ్రీను మాదిగ, మొలు‌గూరి వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News