- జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి
- ఈ కార్యక్రమంలో ఈవీఎస్ లోప్రథమ బహుమతి ఎంపీపీఎస్ ముస్తాల కు రావడం జరిగింది

నేటిసాక్షి చేర్యాల : చేర్యాల మండల కేంద్రంలోని పెద్దమ్మ గడ్డ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం బోధనాభ్యాసన ( టీఎల్ఎం) టీచర్ లర్నింగ్ మెటీరియల్ మేళా ను నిర్వహించగా ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఈ. శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. చిన్నారులు విద్యాబోధన ఎలా చేయాలనే విషయాల పట్ల ప్రాథమిక స్థాయిలో అవగాహన ఇచ్చారు. విద్యార్థులు కనీస సామర్ధ్యాలు సాధించుటకు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, దాంట్లో భాగంగా టిఎల్ఎం అనేటువంటివి ప్రతి ఉపాధ్యాయులు ఉపయోగిస్తూ, విద్యార్థులకు బోధన చేసినట్లయితే విద్యార్థులకు పాఠ్య బోధన 100% అర్థం చేసుకొని ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని సూచించారు.పలువురు మధ్యన విద్యార్థులు జంకు భయం లేకుండా ప్రదర్శన చేయడం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఈవీఎస్ లోప్రథమ బహుమతి ఎంపీపీఎస్ ముస్తాల కు రావడం జరిగింది. 32 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్విరాన్మెంట్ సైన్స్ ప్రథమ బహుమతి ఎంపీపీఎస్ ముస్తాల కు రావడం జరిగింది. మొదటి బహుమతి సాధించగా వారికి సిద్దిపేట డీఈఓ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రంతో పాటు జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రచ్చ, కిష్టయ్య, జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్లు. వై .నర్సింహులు, రామస్వామి, ప్రధానోపాధ్యాయులు ఎం. ఐలయ్య, బి. నాగమణి, పీవీ చంద్రశేఖర్ రావు, మంద స్వరూపారాణి మండలంలోని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




