- విధుల్లో చేరిన 7 నెలలకి సస్పెన్షన్
- ఇన్చార్జి హెచ్ఎం గా మాధవ్ కు బాధ్యతలు అప్పగింత


నేటి సాక్షి, వేమనపల్లి : వేమనపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీఓ ఖుష్బుగుప్తా ఆదేశాలు జారీ చేశారు.ఆశ్రమ పాఠశాలకు చెందిన 28 క్వింటాళ్ల బియ్యం కోటపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తీసుకున్నట్లు చూపించి 18 క్వింటాళ్లు ప్రైవేటు వాహనంలో తరలించారు. దీనిపై రెవెన్యూ అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి రావడంతో అతడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు ఏడు నెలలు మాత్రమే విధులు నిర్వర్తించి సస్పెండ్ అయ్యారు. దీంతో ఉన్నతాధికారులు ఇన్చార్జిగా మంచిర్యాల బాలికల గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మాధవ్ ను నియమించి ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఏం జరిగింది? ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ ఉట్నూరు. సూచనల మేరకు డిటిడిఓ విచారణ జరిపారు. దీంతో శ్రీనివాస్ పై కొన్ని లోపాలు గమనించారు. అలాగే డ్యూటీ టీచర్స్ సూపర్వైజర్ రిజిస్టర్ యొక్కవెరిఫికేషన్ లో కొన్ని టీచర్ల సంతకం గుర్తించబడలేదు. అలాగే స్టాక్ నిలువలు ఇష్యూ రిజిస్టర్ లో నమోదు చేయలేదు. స్టోర్ రూమ్ లో 30 కేజీల చింతపండు ఎక్కువ రోజులు నిల్వఉంచడంతో అది పూర్తిగా పాడైపోయి క్రీములు సంచరించడం మూలంగా డెడ్ స్టాక్ ను తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి సస్పెన్షన్ ఉంటాడు.




