Wednesday, March 25, 2026

రాష్ట్ర ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయాలి

  • కాంగ్రెస్ పార్టీనాయకులు మండ్లదేవన్న నాయుడు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి పట్టణంలో తాను చదువుకున్న ప్రాంతంపై మమకారాన్ని ప్రదర్శిస్తూ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేసి ప్రారంభోత్సవాలకు నేడు వనపర్తికి విచ్చేస్తున్న పాలమూరు బిడ్డ, అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండ్ల దేవన్న నాయుడు ఒక ప్రకటనలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండ్ల దేవన్న నాయుడు మాట్లాడుతూ..వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పెద్దఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,భూమి పూజలు చేయనున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అలుపెరుగని కృషి చేస్తున్నా రన్నారు. గత ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించిన బిఆర్ఎస్ ప్రభుత్వ 10ఏళ్ల పాలనలో వనపర్తి నియోజకవర్గం దోపిడికి గురైందని అక్రమాలు, దాడులు, పోలీస్ కేసులతో భయ భ్రాంతులకు గురిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా సర్వనాశనం చేసిన ఆ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి వేలకోట్ల నిధులతో అభివృద్ధికి శ్రీకారం చుట్టడం గత ప్రభుత్వ పాలకులకు చెంపపెట్టు అన్నారు. ముఖ్యమంత్రి రాకతో వనపర్తిలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహిస్తూ వనపర్తి నియోజకవర్గ ప్రజల హృదయాలలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోనున్నారని దేవన్న తెలిపారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఆధ్వర్యంలో నేడు వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించే బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,మహిళలు, అభిమానులు, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయవలసిందిగా దేవన్న నాయుడు విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News