Wednesday, March 25, 2026

యూరియా బస్తాలకై రైతన్నల పడిగాపులు

  • గంటల తరబడి చెప్పులు లైన్
  • ప్రభుత్వ వైఫల్యం అంటూ రైతుల ఆగ్రహం

నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : ఆరుగలం శ్రమించి పంటను పండించే రైతులకు యూరియా బస్తాలు అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు పంటకు ఉపయోగించే యూరియా బస్తాలు సకాలంలో అందక సొసైటీ సమీపంలో రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు.జగిత్యాల జిల్లా గొల్లపల్లి, వెల్గటూర్, ధర్మారం మండలాల రైతుల గోడును పట్టించుకునే నాదులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సకాలంలో అందించాల్సిన యూరియా అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని బస్తాలకై పడిగాపులు కాస్తున్నమని అవేమి పట్టని ఫెటిలైజర్స్ సైతం బ్లాక్ లో యూరియా బస్తాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గంటల తరబడి చెప్పులు లైన్ లో పెట్టి పడిగాపులు కాస్తున్న ఎవ్వరు స్పందించండం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సకాలంలో యూరియా బస్తాలను అందించి రైతన్నలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News