టెలిగ్రామ్ యాప్ ద్వారా సుమారు పది లక్షలు పోగొట్టుకున్న యువకుడు
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల)
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన మనోజ్ అనే యువకుడు సైబర్ నేరగాళ్ల వలలో సుమారు పది లక్షల రూపాయలు మోసపోయాడు. టెలిగ్రామ్ యాప్ నుండి మెసేజెస్ పంపించి రెట్టింపు డబ్బులు వస్తాయని నమ్మబలికించి సైబర్ నేరగాళ్లు సుమారు 10 లక్షలు దోపిడీ చేశారని యువకుడు ఆవేదన చెందాడు. వివరాల్లోకి వెళితే 06.02.2025 రోజున టెలిగ్రామ్ యాప్ ద్వారా ఏదో గుర్తు తెలియని భావి జోషి అనే అడ్రస్ నుండి మెసేజ్ లు చేసి డబ్బుల ఆశ చూపించడంతో అందులో డబ్బులు జమ చేసి వారు చెప్పిన మాటలు విని సదరు యువకుడు విడుతల వారీగా మొత్తంగా 9,51,000/- రూపాయలు పోగొట్టుకున్నాడు. సైబర్ నేరస్తుల మాటలు నమ్మి డబ్బులు పంపించి మోసపోయానని గ్రహించిన యువకుడు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.యువకుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించమని, ఇలాంటి తెలియని ఫోన్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ ల పై ప్రజలు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఏ విధంగానైనా డబ్బులు కోల్పోతే తక్షణమే సమాచారం ఇవ్వాలని సీఐ ఈ హరికృష్ణ మండల ప్రజలకు పలు సూచనలు చేశారు.




