-ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డి
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర నెలలో ఉపవాస దీక్ష, ప్రార్థనలు, త్యాగం, భక్తి ద్వారా మనమందరం మనలోని మంచితనాన్ని వెలిగించుకుందామని పిలుపునిచ్చారు. ఈ రంజాన్ మాసం మనందరికీ శాంతి, ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వ భావాలను మరింతగా అందించాలన్నారు. ఈ పవిత్ర మాసంలో మీ కుటుంబాలు ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు.




