Wednesday, March 25, 2026

అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది.

నేటిసాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆదివారం రోజు రాయచోటి పట్టణం త్యాగరాజు వీధి రామాలయం నందు ఏర్పాటుచేసిన 17వ వార్షికోత్సవ అన్నదానం కార్యక్రమానికి త్యాగరాజు వీధి బక్తాదులు ఆహ్వానం మేరకు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు విచ్చేసిన సందర్బంగా ఘనస్వాగతం పలికి రామాలయంలో పూజలు చేసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే తిరుణాళ్లకు వివిధ ప్రాంతాలనుండి మరియు కర్ణాటక నుండి విరివిగా వచ్చే భక్తులకు అన్నంకోసం ఇబ్బందులు పడకూడదని త్యాగరాజు వీధి వారు “అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాలకన్న అన్నదానం గొప్పది” అని అన్నదాన సౌకర్యం కల్పించడం చాలా సంతోషంగా ఉందని ప్రసాద్ బాబు గారు తెలియజేసి వారిని అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News