Wednesday, March 25, 2026

దేశ రక్షకుడికి పదవీ విరమణ

నేటిసాక్షి (కె గంగాధర్ ) : పెగడపల్లి మండల కేంద్రం లోని బతుకేపల్లి గ్రామానికి చెందిన బూరుగు జలపతి ఇండియన్ ఆర్మీ లో హావల్దార్(ఏ ఎస్ ఐ)గా 20 సంవత్సరాలనుండి సేవలందించి ఈ రోజు పదవివిరమణ పొందడం జరిగింది. పెగడపల్లి మండలం లోని చుట్టుపక్కల గ్రామాలలోని యువకులు పెద్ద సంఖ్యలో నంది విగ్రహం నుండి బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా సత్కారించడం జరిగింది. అనంతరం జలపతి మాట్లాడుతూ యువకులు భారత సైన్యం లో కి వెళ్లి దేశానికి సేవాలాందించాలని దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమం లో సైనికుడు ప్రశాంత్, మాజీ సైనికులు, మాజీ ఎంపిటీసీ జైపాల్ రెడ్డి, కముటం మల్లయ్య, న్యాయవాది క్యాస రఘునందన్ రెడ్డి, క్యాస మల్లారెడ్డి, గవస్కర్, సందీప్, గణేష్, శేఖర్, తిరుపతి, అంజన్న, అజయ్, రాకేష్, గణేష్, శ్రీనివాస్, నారాయణ, మధు, చందు, రామ్ చరణ్, కరుణాకర్, నరేష్, అక్షిత్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News