- కార్యకర్తలను ప్రసన్నం చేసుకుంటున్నా అభ్యర్థులు
- పార్టీ శ్రేణులు చేయి జారిపోకుండా ప్రయత్నాలు
- ఇప్పటికే రహస్య ప్రదేశాలలో భారీగా సమావేశాలు
- సుక్క.. ముక్కలతో దవతులు

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : పల్లెల్లో ఎక్కడ చూసినా స్థానిక ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. హాళీ లేదు పేరు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ రానే రాలేదు ఆశావాహులు పల్లెల్లో రహస్య ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు బారులు కడుతున్నారు. తెల్లవారగానే ఇండ్ల ముందు వారి పోయి. అక్క, బావ, అన్నా, తమ్ముడు, పిన్ని, బాబాయ్ అంటూ వరుసలు కలుపుతున్నారు. తనకు ఓటు వేయాలంటూ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. అయితే.. ఈ ప్రక్రియలో కార్యకర్తల దే ప్రధాన పాత్ర వారు లేనిదే ఆశావాహులు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. మరోపక్క వారు చేజారకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖ్య కార్యకర్తలకు కావలసిన సౌకర్యాలు సమకూర్చుతున్నారు. ముఖ్యంగా మందు, విందులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు, మద్యం, బిర్యానీలతో చౌకబారు మాటలు చెప్పి కడుపు నింపుతూ తమ వెంట తిప్పుకుంటున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలలో గ్రూప్ రాజకీయాలు ఏర్పడటంతో ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ఆశావహులు ముఖ్య నాయకుల తో రహస్య ప్రదేశాలలో సుక్క.. ముక్క.. సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. పది కుటుంబాలకు ఒక్క ఏజెంట్ ని ఏర్పాటు చేసి బెల్ట్ దుకాణాలలో రాత్రి సమయంలో సుక్క, ముక్క ఏర్పాటు చేసి దవత్ లో ఫలానా అభ్యర్థి అయితే మన మనిషి అని పొగడ్తలతో నమ్మిస్తున్నారు. మొత్తంగా పల్లెల్లో ఎన్నికల కొలహాలం ఊపందుకోవడంతో మద్యం దుకాణాలకి బాగా గిరాకీ పెరిగింది. పల్లెల్లో వలస రాజకీయ నాయకుల పెత్తనం ఏమిటని కార్యకర్తలు, ప్రజలు అసహ్యించుకుంటున్నారు.




