Wednesday, March 25, 2026

ప్రశాంతంగా ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన

  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాల్యమంతా వనపర్తి జిల్లా కేంద్రంతో ముడిపడి ఉన్నందున ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వనపర్తిలో పర్యటిస్తున్నందున పోలీసులు గట్టిభద్రతా చర్యలు తీసుకున్నారు. వనపర్తి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల,ఉన్నత పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ పర్య వేక్షణలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ అన్నారు. సిఎం పర్యటన విజయవంతంగా బందోబస్తు నిర్వహించిన ప్రతి పోలీసు అధికారికి, సిబ్బందిని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News