Wednesday, March 25, 2026

ఆత్మీయ సమ్మేళనం

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో 2005-2006 సంవత్సరంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఈ రోజు పట్టణంలోని రెడ్డి సంఘా భవనంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని వారి పాఠశాలలో వారి యొక్క జ్ఞాపకాలని గుర్తుచేసుకుని ఒకరినొకరు వారి యొక్క ప్రస్తుత పరిస్థితులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి తోటి మిత్రుడు మారం రఘుపతి ఇటివల మృతి చెందగా తన కుటుంబానికి వారి వంతుగా 31,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ ప్రశాంత్ నాగరాజు ఉమాదేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News