
నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : మండలంలోని వెంపేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలు ఆయినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన తెలిపిన వివరాలు.ఉదయం కోరుట్ల మండలం ఏకిన్పూర్ గ్రామానికి చెందిన జోడి నర్సారెడ్డి(65) భార్య అనసూయతో కలిసి తన ద్విచక్ర వాహనంపై మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి తన బంధువుల ఇంట్లో పెళ్ళికి బయలుదేరారు. వారిని వేంపేట గ్రామ శివారులోని ఎస్సార్ ఫంక్షన్ హాల్ ముందు నర్సారెడ్డి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన టిఎస్ 02 యువి 0178 నంబర్ గల ఆర్టీసీ బస్ వేగంగా వచ్చి డికొట్టింది.ఈ ప్రమాదంలో జోడి నర్సారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా మృతుని భార్య పరిస్థితి విశమంగా ఉండడం తో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించినట్లు సి ఐ పేర్కొన్నారు.అజాగ్రత్తగా బస్ నడిపి ప్రమాదానికి కారకుడైనా డ్రైవర్ గుర్రం రాకేష్ పై కేస్ నమోద్ చేసి దర్యాప్తు ప్రారంభం చేసినట్లు సిఐ తెలిపారు.




