Wednesday, March 25, 2026

ఆడబిడ్డల ఆర్థిక స్థితిగతులను ఏ విధంగా మెరుగుపరచాలీ

  • రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం మహిళల సాధికారిక పట్ల కృషి చేస్తున్నారు
  • రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : మహిళల స్వయం ఉపాధికి 21 వేల కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ రుణాలుగా మేళా సంఘాలకు ఇవ్వడం జరిగింది అన్నారు. మహిళలు పెట్రోల్ పంపులు నడుపుకునేందుకు క్యాంటీన్లు నడుపుకునేందుకు సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వము సహకారం చేస్తుందని తెలియజేశారు. ఆర్టీసీలో 1000 బస్సులు మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి నడిపించడం జరుగుతుందని తెలియజేశారు. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు బీమా ఇచ్చేందుకు ప్రభుత్వము భీమా ప్రవేశపెట్టిందన్నారు. దీనితో పాటు మహిళా సంఘాల ద్వారా చనిపోయిన మహిళ తీసుకున్న రుణాన్ని మాఫీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రణాళికలు చేసిందన్నారు. మార్చి 8న హైదరాబాద్ లో మహిళా సంఘాలతో మరియు సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించేందుకు గత ప్రభుత్వం కంపెనీలకు ఆర్డర్ ఇస్తే ప్రస్తుత ప్రభుత్వము మహిళా సాధికారతకై వారి ఉపాధి కొరకు మహిళల చేతనే పిల్లల ఏక రూప దుస్తులు కుట్టించడం జరిగింది. ఆదర్శ పాఠశాలలో మహిళల ద్వారానే పాఠశాలల మరమ్మతులు, ఇతర సదుపాయాల పనులు చేయించి వారికి ఉపాధి కల్పించడం జరిగింది. మహిళలకు ప్రభుత్వము కల్పిస్తున్న సహకారాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News