- కొత్త కోట సిఐ రాంబాబు
- కొత్తకోట ఎస్సై ఆనంద్
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రలోని ఎస్బిఐ బ్యాంక్ ముందు నూతనంగా రవి చిల్డ్రన్స్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. కొత్త కోట సిఐ రాంబాబు పాల్గొని ప్రారంభించారు. చిన్న పిల్లల డాక్టర్ రవి కి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రవి, నరేష్ లు కొత్తకోట సిఐ రాంబాబు కి, ఎస్సై ఆనంద్ కి,మాజీ జడ్పిటీసి పొగాకు విశ్వశ్వర్ కి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటీసి పొగాకు విశ్వశ్వర్, 11వ వార్డు మాజీ కౌన్సిలర్ కొమ్ము భరత్ భూషణ్, 15వ వార్డు కౌన్సిలర్ ఖాజా మైనోద్ధిన్, బిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షులు లాలూ, పట్టణ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రచార కార్యదర్శి జహీర్, బీజేపీ నాయకులు కొమ్ము సురేష్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు రాములు నాయుడు, రవి కుమార్, నాకొండ, ధనుష్, వెంకటేష్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శంకర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.




