నేటిసాక్షి (కె. గంగాధర్ )పెగడపల్లి : జగిత్యాల జిల్లా కేంద్రంలో డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి వాల్పోస్టర్ విడుదల చేశారు. వేములవాడలో జరుగు డిహెచ్పిఎస్ రాష్ట్ర సమావేశాలు విజయవంతం చేయాలని మూడు రోజులపాటు మార్చిలో 10,11,12 తేదీలలో జరుగు రాష్ట్ర సమావేశాలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్ విడుదల చేసిన అనంతరం డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాళ్ల భూమేశ్వర్ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ దళితులు నేటికీ ఆర్థిక స్వాతంత్రం సాధించలేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి సంక్షేమ పథకాల అమలు చేయాలని ఎస్సీ సబ్ ప్లాన్ ను పటిష్టం చేయాలని దళిత బంధు కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంబేద్కర్ కింద దళితులకు 12 లక్షలు ఇస్తానని ఎన్నికల మీద భాగంగా చెప్పారని దాన్ని అమలు చేయాలని కోరారు. దళితులకు ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చి వారికి అమ్ముకునే హక్కును కూడా కల్పిస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల భాగంగా చెప్పారని దాన్ని కనీసం సాగుకు యోగ్యమైనటువంటి ప్రభుత్వ భూమిని నిరుపేదలైన దళితులకు ఇవ్వాలని కోరారు. వేములవాడలో జరుగు ఈ వర్క్ షాప్ దళితుల సమస్యలు పరిష్కరించుకునేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు మొనుగూరి హనుమంత్, జిల్లా సహాయ కార్యదర్శి రామిల్ల రాంబాబు, ఎండి ముక్కురం, శనిగర ప్రవీణ్, సిరికొండ చిన్న నరసయ్య, నాగరాజు, మాదాసు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.




