- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ

నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి: కౌలు రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లోని ఎల్ఐసి ఏజెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కౌలు రైతు సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడానికి గ్రామ సభలను ఏర్పాటు చేయాలని అన్నారు. కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా రైతులతో పాటుగా కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలి అని తీర్మానం చేసామన్నారు. మన రాష్ట్రంలో 60 లక్షల ఎకరాలకు పైగా పత్తి పంటను సాగు చేస్తున్నారు . ఇందులో గణనీయంగా పత్తి పంటను కౌలు రైతులు కూడా సాగు చేస్తున్నారన్నారు. ఈ పత్తి పంటకు వచ్చే గులాబీ రంగు రోగాన్ని నిరోధించడానికి లక్నోలో ఉన్నటువంటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ సెంటర్ ఒక మంచి టెక్నాలజీని కనిపెట్టింది అన్నారు. ఈ టెక్నాలజీని అంకుర్ అనే కంపెనీ తనను కలుపుకొని డెవలప్ చేయాలని కొరతా ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం యుపి ప్రభుత్వం అందుకు సిద్ధం కావద్దు అన్నారు. ఎందుకు అంటే గతంలో బిటీ వన్, బీటీ టు వీటిని తయారుచేసిన మానుసెంటు కంపెనీ బి1 బిటి టు వలన రైతులు దారుణంగా నష్టపోయారని అన్నారు. పురుగులను నియంత్రించేటటువంటి బి1 బి2 లో లేకపోయింది. ఇప్పుడు లక్షల సంఖ్యలో ఉన్న రైతులకు గొప్ప ఊరటగా లక్నోలో ఉన్నటువంటి బొటానికల్ రీసెర్చ్ సెంటర్ లో తయారుచేసిన ఈ విత్తనం తీసుకువచ్చి హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో విత్తన ఉత్పత్తి చేసి రైతులకు తగ్గింపు ధరలలో విత్తనాలను అందించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ న్నామన్నారు. ఈ రాష్ట్రంలో దేశంలో రైతు సృష్టించే 70% సంపదను విత్తనాలను సృష్టించే కంపెనీల, ఎరువుల కంపెనీల, వ్యవసాయ యంత్ర పనిముట్ల కంపెనీల కు పోతా ఉన్నట్లు కనిపిస్తుంది అన్నారు. రైతులకు 30 శాతం మాత్రమే అందుతుంది అని ఐరోపా స్వచ్ఛంద సంస్థ ఓఈసీడి వ్యక్తం చేసింది. ఈ 70 శాతం ప్రైవేట్ కంపెనీల దోపిడీ చేయకుండా మార్కెట్ నియంత్రణ చట్టం, విత్తన చట్టం కూడా తీసుకుని రావాల్సిన అవసరం ఉంది అన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, అదేవిధంగా రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 13 సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కౌలు రైతులను రైతులను రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలి అని వ్యవసాయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ కొప్పోజ్ సూర్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి అన్నం పాపిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లి ప్రసాదు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీను, జిల్లాప్రధాన కార్యదర్శి దొడ్డ వెంకటయ్య, బెజవాడ వెంకటయ్య, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రామారావు, కొత్తగూడెం అధ్యక్షులు నెహ్రు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు బండమీద వెంకటయ్య, రైతులు నరసింహారెడ్డి, యలమంద నాగేశ్వరావు, సంజీవరెడ్డి, నరసయ్య, దాసబోయిన రామయ్య, వెంకయ్య, పాపిరెడ్డి, తదిత రైతులు పాల్గొన్నారు.




