- మహేశ్వరం నియోజకవర్గం లో 5వ తేదీన సరూర్నగర్ లోని డి టి ఆర్ సి భవనంలో క్యాంపు ఏర్పాటు

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోని అనేకమంది వయోవృద్ధులు వికలాంగులు కోసం అలింకో సంస్థ (అలింకో – ఆర్టిఫిషల్ లింబ్స్ మణు్ఫాక్చరింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ) జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించి అర్హులైన వికలాంగులకు పరికరాలు అందించడానికి కేంద్ర మంత్రికి లేఖ రాయడం జరిగింది. ఫలితంగా.. కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ వీరేంద్ర కత్తికి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ మరియు అలిమ్కో సంస్థ ద్వారా ఈ నెల 4వ తేదీన చేవెళ్ల టౌన్ అట్లాస్ మినీ హాల్ నందు 5వ తేదీన సరూర్ నగర్ లోని డిడిఆర్సి భవనంలో, 6వ తేదీన శంషాబాద్ మహిళా మండలి భవనంలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అర్హులైన వయోవృద్ధులకు వికలాంగులకు వినికిడి యంత్రాలు, చేతి కర్రలు, బ్యాటరీ ట్రై సైకిల్లు, విరిగిన కాళ్లు, చేతులకు కృత్రిమ అవయవాలు ఉచితంగా ఇస్తారు. ఈ క్యాంపునకు హాజరయ్యే వికలాంగుల
- ఆధార్ కార్డు,
- వికలాంగుల సర్టిఫికెట్,
- రూ. 2,70,000/- లోపు ఉన్న వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
యూనిక్ డిజేబులిటీ ఐడెంటి కార్డు తీసుకొని ఈ క్యాంపులకు హాజరు కావాలని కోరుతున్న కేంద్ర ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ క్యాంపులను మహేశ్వరం నియోజకవర్గంలోని అర్హులైన వికలాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాను.
అందెల శ్రీరాములు యాదవ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్.




