- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్య క్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, లతో పాటు పాల్గొని ప్రజల సమస్యల పైన వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడమైనది. సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో మొత్తం దరఖాస్తులు (88) రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కువగా భూ సంబంధిత సమస్యల పై 23 దరఖాస్తులు కలెక్టరేట్ సూపర్డెంట్ 15, జిల్లా వ్యవసాయ శాఖ 11, జిడబ్ల్యూ ఎం 2, డిసి ఎస్ఓ 5 దరఖాస్తులు వచ్చాయని, మిగతావి వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల పైన దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించలేని దరఖాస్తులను ఎందుకు పరిష్కరించ లేదో దరఖాస్తు దారునికి తెలియ జేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. లేని ఎడల వచ్చిన దరఖాస్తు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు గ్రీవెన్స్ పోర్టల్ లో ఉన్న వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయలక్ష్మి వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి ఉమారాణి లు, డిఆర్డిఓ కౌసల్య దేవి, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,
డిసిఓ నీరజ, డిపిఓ కల్పన వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్ సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.




