- పి డి ఎస్ యు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి
నేటి సాక్షి , మునగాల : తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల నెపంతో విద్యార్థులను ఫీజుల కోసం హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కార్పొరేట్ కళాశాలల పై చర్యలు తీసుకోవాలని సోమవారం పి డి ఎస్ యు సూర్యాపేట జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్రారంభమయ్యే నేపథ్యంలో ఇదే అదునుగా కార్పొరేట్ కళాశాలలు, ఇతర ప్రైవేట్ కళాశాలల యజమాన్యం ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని. దీని కారణంగా అనేక మంది విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాల్ టికెట్ ఇవ్వాని కళాశాలలను గుర్తించి చర్యలు తీసుకోవాలని. ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి కాలేజీ ఫీజు తో సంబంధం లేకుండా హాల్ టికెట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చెల్లించలేని మూలంగానే విద్యార్థులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి మొత్తం బకాయిలను చెల్లించాలని కోరారు. కళాశాల యజమాన్యాల కారణంగా పరీక్షలకు హాజరు కాకపోయినా, మానసిక ఇబ్బందులకు గురైన ఎలాంటి చర్యలకు పాల్పడిన ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. ఇంటర్మీడియట్ బోర్డు పైన ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల సంఘాలతో ఏకమై ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, నవీన్, పవన్, వినయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.




