Thursday, March 26, 2026

పల్లె ప్రకృతి వనంలో చెట్లు దగ్ధం

నేటిసాక్షి,గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలంలోని మైలారం పంచాయతీ పల్లెప్రకృతి వనంలో 200 చెట్లు దగ్నం అయ్యాయి మైలారం శివారులో రెవెన్యూ అధికారులు సుమారు10 ఎకరాల స్థలాన్ని పల్లెప్రకృతి వనానికి కేటాయించారు. అప్పటి సర్పంచ్ దుడ్డు రేణుక, పంచాయతీ కార్యదర్శి మొక్కలు నాటించి గత కొంతకాలంగా నీరు పోయిస్తూ సంరక్షిస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రకృతి వనంలోకి మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు . సోమవారం ఘటన స్థలాన్ని ఇంచార్జి ఎంపిడివో శ్రినువాస్, గ్రామా సెక్రెటరి, నాయకులూ, గ్రామస్తులు పరిశీలించారు. ఎవరో ఆకతాయిలు నిప్పు పెట్టి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ విషయమై గ్రామా సెక్రెటరి చిరంజీవి పోలీసులను ఆశ్రయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News