నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : సమీకృత కలెక్టరేట్ ఆవరణ లో రెండవ అంతస్తులో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండటం వలన అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. డి ఎం హెచ్ ఓ నాయకత్వంలో ప్రోగ్రాం అధికారులు సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయ కుమార్ అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ టి. మదన్మోహన్రావు, పిఓడిటి డాక్టర్ కె. లలితాదేవి, జిల్లా టీబి నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ అహ్మద్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కె రాజేష్ కుమార్, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, గణాంక అధికారి, ప్రసన్న కుమార్ సూపర్డెంట్ వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.




